ఆ పదవిపై నాకు ఆసక్తి లేదు.. ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ వివరణ

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్‌ను నియమించేలా ప్రభుత్వంలో జరుగుతున్న కసరత్తుపై స్వయంగా ఆయన వివరణ ఇచ్చారు.

Update: 2023-12-11 08:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్‌ను నియమించేలా ప్రభుత్వంలో జరుగుతున్న కసరత్తుపై స్వయంగా ఆయన వివరణ ఇచ్చారు. ఇప్పటివరకూ తనను ప్రభుత్వం తరఫున ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఆ పదవిపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, ఆ బాధ్యతల్లో ఉండాలన్న ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. మరికొంతకాలం యాక్టీవ్ జర్నలిజంలోనే కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆ నియామకం గురించి తనకు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదని, అలాంటి ఉద్దేశం కూడా తనవైపు నుంచి లేదన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న పాత్రికేయరంగంలోనే ఇంకొంతకాలం ఉంటానని వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News