Anand Mahindra: ఎన్ని గంటలనేది కాదు.. ఉద్యోగుల పని గంటలపై ఆనంద్ మహింద్రా కీలక వ్యాఖ్యలు

ఉద్యోగుల పని గంటలపై ఆనంద్ మహింద్రా కీలక వ్యాఖ్యలు

Update: 2025-01-11 10:26 GMT
Anand Mahindra: ఎన్ని గంటలనేది కాదు.. ఉద్యోగుల పని గంటలపై ఆనంద్ మహింద్రా కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగుల పని గంటలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వారానికి 90 గంటలు పని చేయాలనే కార్పొరేట్ పెద్దల వాదనలు బలపడుతున్న తరుణంలో ఈ అంశంపై మహింద్ర చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వాంటిటి కాదు క్వాలిటీ ముఖ్యం అని స్పష్టం చేశారు. ఢిల్లీలోని మహీంద్రాలో విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో మాట్లాడిన ఆయన తాను పని నాణ్యతను నమ్ముతానని పరిమాణాన్ని కాదు. అన్నారు. ఉద్యోగుల పని గంటల పరిమాణాన్ని నొక్కిచెప్పడం వల్ల జరుగుతున్న చర్చను ఆయన తప్పుపట్టారు. నాకు నారాయణ మూర్తి  (Infosys Narayana) ఇతరులపై అపారమైన గౌరవం ఉంది. కాబట్టి నేను దీన్ని తప్పుగా భావించవద్దు. అయితే నేను ఒక విషయం చెప్పాలి, ఈ చర్చ తప్పు దిశలో ఉందని నేను భావిస్తున్నాను అని యువతను ఉద్దేశించి చెప్పారు.

నా ఉద్దేశ్యంలో ఎంత సేపు పని చేస్తున్నామననేది ముఖ్యం కాదు.. మనం చేస్తున్న పని నాణ్యతపై దృష్టి పెట్టాలి, పని పరిమాణంపై కాదన్నారు. పని గంటలు అనేది పూర్తిగా వచ్చే అవుట్ పుట్ పై ఆధారపడి ఉంటుందన్నారు. తమ కంపెనీలో తెలివైన నిర్ణయాలు, ఎంపికలు చేసే నాయకులు, వ్యక్తులు ఉండాలని తాను ఎప్పుడూ నమ్ముతానన్నారు. ఆటోమొబైల్ రంగాన్ని ఉదహరిస్తూ మేము మా కుటుంబాలతో కాకుండా ఇతర కుటుంబాలతో కాకుండా కేవలం ఆఫీసుకే పరిమితం అయితే ప్రజలు ఎలాంటి కార్లు ఆశిస్తున్నారో మేము ఎలా అర్థం చేసుకోగలం అన్నారు. కాగా దేశం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగులు 90 గంటలు పని చేయాలని ఇటీవల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ సుబ్రహ్మణ్యన్ (L&T Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో ఆనంద్ మహేంద్ర చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. 

Tags:    

Similar News