తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

తెలంగాణ పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. ప్రముఖ మెడికల్ డివైజెస్ ఉత్పత్తి సంస్థ మెడ్ ట్రానిక్స్ రాష్ట్రంలో సుమారు రూ.3 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది.

Update: 2023-05-18 09:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. ప్రముఖ మెడికల్ డివైజెస్ ఉత్పత్తి సంస్థ మెడ్ ట్రానిక్స్ రాష్ట్రంలో సుమారు రూ.3 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సంస్థ ఆసక్తి చూపగా ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలకు వరుసగా రాష్ట్రానికి తరలి వస్తున్న పెట్టుబడులే నిదర్శనం అన్నారు. అమెరికా వెలుపల మెడ్ ట్రానిక్స్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తుండటంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సంస్థ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవంపై మెడ్ ట్రానిక్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణ స్థానాన్ని గ్లోబల్ హబ్‌గా బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read..

తెలంగాణలో భజరంగ్ దళ్‌ను బ్యాన్ చేయాలని KCR ప్లాన్: బండి సంజయ్ ఫైర్ 

Tags:    

Similar News