87 ఏళ్ల మహిళకు మిట్రాక్లిప్‌ విధానంలో చికిత్స.. విజయవంతంగా నిర్వహించిన అపోలో కార్డియాలజిస్టులు

Update: 2023-08-02 14:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: పునరావృత గుండె వైఫల్య సమస్యతో బాధపడుతున్న 87 ఏళ్ల మహిళకు వినూత్నమైన నాన్‌-సర్జికల్‌ మిట్రల్‌ వాల్వ్‌ ప్రోసీజర్‌ను అపోలో కార్డియాలజిస్టులు విజయవంతంగా నిర్వహించారు. డబుల్‌ క్లిప్‌తో కూడిన మిట్రాక్లిప్‌ ప్రోసీజర్‌ను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం ఇదే తొలిసారి. 87 ఏళ్ల వృద్ధురాలు లీలా నాయర్‌కు విజయవంతంగా చికిత్స చేశారు. మిట్రల్‌ వాల్వ్‌ రెగర్జిటేషన్‌ లేదా వాల్వ్‌ యొక్క లీకేజ్‌ అనేది ఒక గుండె జబ్బు. ఎడమ గుండె గదుల మధ్య వాల్వ్‌ సరిగ్గా మూసివేయడంలో విఫలమైనప్పుడు, గుండె నుండి రక్తం వెనుకకు లీకేజీకి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 24 మిలియన్ల మంది ప్రజలను ఈ సమస్య ప్రభావితం చేస్తున్నది.


రోగి శ్రీమతి లీలా నాయర్‌ మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా గుండెలో శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడి దానికి మందులతో చికిత్స పొందుతున్నాను. ఇటీవల డాక్టర్‌ రంగా రెడ్డి నాకు శస్త్రచికిత్స లేకుండా మిట్రాక్లిప్‌ విధానాన్ని సూచించి చికిత్స చేశారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోనే నడుచుకుంటూ నా పనులు నేను చేసుకునే స్థితిలో ఉన్నాను తెలిపింది.


Similar News