బలవంతంగా చేర్చుకోవడానికి నేను చిన్న పిల్లాడినా..?.. పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బలవంతంగా చేర్చుకోవడానికి నేను చిన్న పిల్లాడిని కాను అని, రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బలవంతంగా చేర్చుకోవడానికి నేను చిన్న పిల్లాడిని కాను అని, రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, ఆయన రైతు పక్షపాతి అని పోచారం కొనియాడారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తున్నానని, బలవంతంగా చేర్చుకొవడానికి నేను చిన్నపిల్లాడిని కాదని, రైతుల సంక్షేమం కోరుకొనే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నానని తెలిపారు.
తన ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీలో అని, సోంతగూటికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ లో చేరిక వెనుక రాజకీయంగా ఆశిస్తున్నది ఏమి లేదని, మంచి ఆలోచనలతో సీఎం ఆహ్వానించారని, అందుకే వెళ్లానని తెలిపారు. ప్రగతి కోసం కలిసి ముందడుగు వేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని. రేవంత్ రెడ్డి కార్యక్రమాలు బాగున్నాయని, పనిచేసే నాయకత్వాన్ని సమర్ధించేందుకే రేవంత్ కు మద్దతిస్తున్నానని, ఆయన నాయకత్వంలో పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని పోచారం స్పష్టం చేశారు.