ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : మంత్రి కొండా సురేఖ

ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సాధ్యమైనంత త్వరలో వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని

Update: 2024-11-11 13:18 GMT

దిశ, వరంగల్ : ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సాధ్యమైనంత త్వరలో వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఓ సిటీలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలకు చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు క్యాంప్ ఆఫీసు కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను మంత్రికి వివరించారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి చాలా వరకు సమస్యలను మంత్రి సురేఖ అక్కడిక్కడే పరిష్కరించారు. గతంలో అధికారులకు నివేదించి, పరిష్కారానికి నోచుకోని విజ్ఞప్తుల పై ఆరా తీసి సంబంధిత అధాకారులతో ఫోన్ లో మాట్లాడి వెంటనే ప్రజల విజ్ఞప్తులను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. గతంలో వచ్చిన దరఖాస్తులు, వాటిలో పరిష్కారానికి నోచుకున్నవి, పలు కారణాలతో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పై మంత్రి సురేఖ ఆరా తీశారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పులోనూ, హైదరాబాద్ లోనూ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.


Similar News