Allu Arjun:సీఎం రేవంత్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్(Icon star) అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప- 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్(Icon star) అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప- 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పుష్ప-2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఇదిలా ఉంటే పుష్ప-2 మూవీ టికెట్ల ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ సినిమా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. తాజాగా ‘పుష్ప-2’ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడం పై తెలంగాణ ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా, ఇండస్ట్రీకి సపోర్టుగా నిలుస్తోన్న సీఎం రేవంత్(CM Revanth Reddy)కు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy)కి ప్రత్యేక ధన్యవాదాలు అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.
Read More...
Pushpa-3 Title: పుష్ప-3 టైటిల్ లీక్.. ఎగిరిగంతులేస్తోన్న ఐకాన్‌స్టార్ అభిమానులు..?