వైద్యానికి రూ.11,468 కోట్లు.. గతేడాదికంటే భారీగా పెరిగిన నిధులు..!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–2025 బడ్జెట్‌లో వైద్యారోగ్యశాఖకు రూ.11,468 కోట్లను ప్రతిపాదించారు. అంటే రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య

Update: 2024-07-25 16:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–2025 బడ్జెట్‌లో వైద్యారోగ్యశాఖకు రూ.11,468 కోట్లను ప్రతిపాదించారు. అంటే రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 3.93 శాతం చొప్పున నిధులు కేటాయించారు. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాని కంటే ఈ సారి ఎక్కువగా నిధులు కేటాయించినట్లు సర్కార్ రిపోర్టు తెలియజేస్తున్నది. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు రూ.12,161 కోట్లను కేటాయించారు. కానీ వాటిలో కేవలం రూ.9135 కోట్లను మాత్రమే ఖర్చు చేసినట్లు బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్(ఆర్‌ఈ) స్పష్టం చేస్తున్నది. కానీ తమ బడ్జెట్ వాస్తవాన్ని ప్రదర్శిస్తుందని ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది.

కాంగ్రెస్ సర్కార్ ఈ ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పెండింగ్ లోని మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ.542 కోట్లు, కొత్త నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకు రూ.200 కోట్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు రూ.260 కోట్లు, ఇంటిగ్రెటెడ్ హాస్పిటల్ ఫెసిలిటి మేనేజ్ మెంట్ సర్వీసెస్ కు రూ.268 కోట్లు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.110 కోట్లు, డయాగ్నస్టిక్స్ పరికరాలు కొనుగోలుకు రూ. 250 కోట్లు, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి రూ.59 కోట్లు, నిమ్స్‌కు రూ. 3 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని ఆసుపత్రుల అప్ గ్రేడేషన్ కు రూ.110 కోట్లు, టీవీవీపీ ఆసుపత్రుల మేనేజ్ మెంట్‌కు రూ.మరో 114 కోట్లు, పాత మెడికల్ కాలేజీల ఎస్టాబ్లిష్​ మెంట్‌కు రూ. 121 కోట్లు, ఆయూష్మాన్ భారత్ మ్యాచింగ్ గ్రాంట్స్‌కు రూ.168 కోట్లు చొప్పున కేటాయించారు.

అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతానికి రూ.51 కోట్లు, అమ్మ ఒడికి రూ.141 కోట్లు, 102,104 వాహనాల కోసం రూ.37 కోట్లు, నిమ్స్ అత్యవసర విభాగంలోని పరికరాలకు రూ.49 కోట్లు, వైద్య విధాన పరిషత్ పేషెంట్ కేర్, శానిటేషన్ కు రూ.382 కోట్లు కేటాయించారు. డిజిటల్ ఆఫ్ హెల్త్ కేర్ కు రూ.150 కోట్లు, ప్రగతి పద్దులో వైద్య, విద్య విభాగానికి రూ.2656 కోట్లు, పబ్లిక్ హెల్త్ కు రూ.558 కోట్లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి రూ.1762 కోట్లు, డ్రగ్స్ కు రూ. 377 కోట్లు, ఎంసీహెచ్ కిట్లకు రూ. 200 కోట్లను కేటాయిస్తూ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఆరోగ్య శ్రీకి మాత్రం గతం కంటే రూ.398 కోట్లు తక్కువగా ప్రతిపాదించారు. 2024–2025 ఆర్ధిక సంవత్సరంలో 1065 కేటాయించగా, గత ప్రభుత్వ బడ్జెట్ లో రూ. 1463 కోట్లు కేటాయించారు.


Similar News