వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు.. వామపక్షాల క్లారిటీ

దేశంలో బీజేపీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-13 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బీజేపీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోనే కలిసి వెళ్లాలని సీపీఎం, సీపీఐగా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదని అన్నారు. ఈ విషయం ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో స్పష్టమైందని తెలిపారు. ఉప ఎన్నికలో బీజేపీని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ సఫలమైందని అన్నారు. బీజేపీ కేవలం మతం ఆధారంగానే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికలప్పుడే రామ మందిర ప్రస్తావన తీసుకొచ్చి విద్వేశాలు రెచ్చగొడతారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే అది కేవలం బీఆర్ఎస్‌తోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News