Minister Ponnam : కాంగ్రెస్ పాలనలో సర్వమతాలకు సమాదరణ : మంత్రి పొన్నం

కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government)పాలనతో అన్ని మతాలకు సమాన ఆదరణ ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) స్పష్టం చేశారు.

Update: 2024-12-13 09:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government)పాలనతో అన్ని మతాలకు సమాన ఆదరణ ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ చర్చిలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకల(Grand Christmas celebrations)కు మంత్రి పొన్నం హాజరై మాట్లాడారు. అందరూ వారి భావాల మేరకు స్వేచ్చగా జీవించేలా సెక్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. లోక కల్యాణం కోసం అందరూ కూడా సుఖంగా ఉండలని ఏసు ప్రభువు కీర్తనలు ప్రవచనలు ఆలోచనలతో ముందుకు పోవాలన్నారు. త్యాగానికి మారుపేరుగా సమాజంలో క్షమాగుణం గుణం ఉండాలని ఏసు ప్రభువు సందేశాన్ని అనుసరించాలన్నారు.

ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రజా పాలన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రైతులు పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా ఉండాలని ఏసు ఆశీస్సుల కోసం అంతా ప్రార్ధించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బ్రదర్ అనిల్, క్రిస్టియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధీపక్ జాన్, క్రిస్టియన్ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆశీర్వచనం ఇస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

Tags:    

Similar News