అలర్ట్ : రేపు సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
ఈ నెల (ఏప్రిల్)8వ తేదీన హైదరబాద్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తుండడంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల (ఏప్రిల్)8వ తేదీన హైదరబాద్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తుండడంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంబోత్సవం తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో పబ్లిక్ మీటింగ్‌లో ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లించనున్నారు.
ఎస్‌బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి స్వీకార్, ఉపకార్ జంక్షన్ వరకు రెండు వైపుల రోడ్డు మూసేస్తారు. తివోలి ఎక్స్ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్ రోడ్డు వరకు, చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, రేతిఫైల్ టీ జంక్షన్ల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలకు అనుమతి ఉండదు. ప్రయాణికులు క్లాక్ టవర్ పాస్‌పోర్టు అఫీస్, రెజిమెంటల్ బజార్ దారిని ఉపయోగించుకొని సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ గేట్ వద్దకు చేరుకోవాలి. కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా పట్టణానికి వచ్చే వారు ఓఆర్‌ఆర్ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట్ మీదుగా రావొచ్చు.
అలాగే ఓఆర్‌ఆర్ గేట్ నుంచి ఈసీఐఎల్, మౌలాలీ, నాచారం, ఉప్పల్ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి. కీసర తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి ఎడమవైపు తీసుకొని ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, మౌలాలీ, తార్నాక నుంచి సిటీలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి. కరీంనగర్ వైపు రాకపోకలు సాగించే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్, జేబీఎస్ దార్ల గుండా వెళ్లకుండా ఓఆర్‌ఆర్‌పై నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.
పార్కింగ్ స్థలాలు
ఆర్టీసీ బస్సుల కోసం కరీంనగర్ రూట్‌లో వచ్చే దోబీఘాట్, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి వైపు నుంచి వచ్చే వాహనాలు బైసన్ పోలో, రంగారెడ్డి, కర్నూల్, అచ్చంపేట్, నల్గొండ, ఖమ్మం, సూర్యపేట్, వరంగల్, యాదాద్రి రూట్‌లో వచ్చే వారు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో పార్కు చేసుకోవాలి. రాజీవ్ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను కంటోన్మెంట్ పార్కు గ్రౌండ్, పికెట్ డిపో ప్రాంగణంలో, అలాగే రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డులో పార్కు చేయాలి.