తెలంగాణకు అలర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

24 గంటల్లో భారీవర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Update: 2023-06-25 10:26 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీవర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

లేటుగా ఎంటరైన నైరుతి రుతుపవనాలు ఈ రోజు వరకు బలంగా విస్తరించాయి. ఉత్తర తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కొమరం భీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు వర్ష ప్రభావం అధికంగా ఉండనుంది. హైదరాబాద్‌కు మోస్తరు నుంచి భారీ వర్ష సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. 


Similar News