సిగ్గులేకుండా ఆ విషయం చెబుతున్నారా.. BRS ఎమ్మెల్సీపై ఆకునూరి మురళి సీరియస్

బీఆర్ఎస్ ప్రభుత్వం కుల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఇంత మంది రెడ్లకు కేబినెట్‌లో స్థానం కల్పించింది కేవలం ఒక్క కేసీఆర్ మాత్రమేనని, ఆరుగురు మంత్రులు, స్పీకర్

Update: 2023-05-23 10:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం కుల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఇంత మంది రెడ్లకు కేబినెట్‌లో స్థానం కల్పించింది కేవలం ఒక్క కేసీఆర్ మాత్రమేనని, ఆరుగురు మంత్రులు, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్లు, రైతుబంధు కమిటీ చైర్మన్‌తో పాటు 9 కేబినెట్ స్థాయి పోస్టులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేకుండా కుల ఆధిపత్యాన్ని చెప్పుకుంటూ ఆర్థిక దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందరూ రెడ్లు, వెలమలు దోపిడీ దారులు కాదన్న ఆయన.. బీఆర్ఎస్‌లోని ఇలాంటి దోపిడీ దార్లను తరిమికొట్టాలన్నారు. తెలంగాణ సంపదను కొల్లగొట్టుకుంటూ పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించకుండా అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ యువత గమనించాలన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..