Akunuri Murali: మంత్రి సంగతి సరే.. నీకు తెలుగు ఎందుకు రాదు..?: ఆకునూరి మురళి
అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు ఆకునూరి మురళి కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మంత్రి సీతక్కకు (Seethakka) ఇంగ్లీష్, హిందీ రాదని.. తనకేమో తెలుగు రాదని అందుకే తన మాటలను మంత్రి తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ (Akbaruddin) నిన్న సభలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి (Akunuri Murali) కౌంటర్ ఇచ్చారు. ‘మంత్రి గారికి హిందీ రాదు సరే.. మరి నీకు తెలుగు ఎందుకు రాదు బాబు?’ అంటూ ఇవాళ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగావ్ కదా.. రాష్ట్రంలోనే మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార భాష తెలుగు నేర్చుకోవాలనే సామాజిక బాధ్యత మీకు ఉండాలి కదా అని నిలదీశారు. అసెంబ్లీలో అందరూ సభ్యులు, మంత్రులు తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు మీకు ఏం అర్థం అవుతుంది? ఏదో ఒకటి సభలో ఇంగ్లీష్ స్పీచ్ దంచేసి వెళ్లిపోతే సరిపోతుందా? తెలుగు రాకపోతే రాష్ట్రంలో సమస్యలు మీకు ఎలా అర్థం అవుతాయన్నారు. హిందీ, ఇంగ్లీష్ రాకపోతే అంత చిన్న చూపెందుకు..? అని మండిపడ్డారు.