ఆహ్లాదంగా పల్లె ప్రకృతి వనాలు: జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు

గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయని, అభివృద్ధి బాగుందని జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కుమార్ పమ్మీ పేర్కొన్నారు.

Update: 2023-02-28 15:19 GMT

దిశ, ములుగు: గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయని, అభివృద్ధి బాగుందని జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కుమార్ పమ్మీ పేర్కొన్నారు. మంగళవారం ములుగు, మర్కుక్ మండల కేంద్రాలతో పాటు దామరకుంట గ్రామంలో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. దామరకుంట గ్రామంలోని ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా మర్రికుంట ప్రాంతంలో జరిగిన పనులను పరిశీలించిన తరువాత జాతీయ ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. అనంతరం మర్కుక్ మండల కేంద్రంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనంతో పాటు రైతు వేదికలు డంపింగ్ షెడ్, స్మశాన వాటికలను సందర్శించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలోని మారుమూల పల్లెల్లో ఇక్కడి ప్రజల అవసరాల తగిన విధంగా అభివృద్ధి ఉందని అన్నారు. కార్యక్రమంలో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు మున్నావర్ హైమద్, అడిషనల్ పీడీ కౌసల్య దేవి, సర్పంచులు బట్టు మాధవి అంజిరెడ్డి, భాస్కర్, గాయత్రి బాల నర్సయ్య, మర్కుక్ ములుగు ఎంపీడీవోలు ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ కు సంబంధించిన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, స్థానిక ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News