Agniveer Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద 2024-2025 సంవత్సరానికి గాను ఫైర్‌మెన్ నియామకాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద 2024-2025 సంవత్సరానికి గాను ఫైర్‌మెన్ నియామకాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, అందుకు సంబంధించిన వివరాలను సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమైందని, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 22 వరకు స్వీకరించనున్నారు. అదేవిధంగా పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి నిర్వహించనున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. పెళ్లికాని పురుషు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి దశలో ఫిజికల్, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పోస్టులు విషయానికి వస్తే.. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివేర్ ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇక అగ్నివీర్ జనరల్ డ్యూటీకి కనీసం 10వ తరగతి 45 మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నికల్ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి, ఐటీఐ కూడా చేసి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను పరిశీలిస్తే.. 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. ట్రేడ్స్‌మన్‌కు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి 17 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని విరవాలను అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in లో సంప్రదించాలని అధికారులు తెలిపారు.