Kalvakuntla Kavitha: 'కవితకు ఆ సలహా ఇచ్చిందెవరో అర్థం కావడం లేదు'
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనకు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందిస్తూ సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనకు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందిస్తూ సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది. సీబీఐ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని ఈ కేసులో డిసెంబర్ 6న విచారణకు హాజరు కాలేనంటూ కవిత రాసిన లేఖపై బీజేపీ మహిళా నేత, అడ్వకేట్ రచన రెడ్డి స్పందించారు. కవిత ఎవరి సలహా మేరకు సీబీఐకి ఈ లేఖ రాశారో అర్థం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 160 సీఆర్పీసీ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిందని, ఆ సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చేందుకు ఎఫ్ఐఆర్ లో పేరు ఉండాల్సిన అవసరం లేదన్నారు.
సాక్షిగా విచారణకు పిలిచిందే తప్ప ఎఫ్ఐఆర్ లో పేరు ఉంది కాబట్టి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ ఎక్కడా స్పష్టం చేయలేదన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేదన్న కారణంతో సీబీఐ విచారణకు కవిత హాజరుకానని చెప్పడం సరికాదని, సీఆర్పీసీ 160 నోటీసులు జారి అయినప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు అయినా కాకున్నా విచారణకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఎఫ్ఐఆర్ లో కవిత పేరు ఉంటే ఆమెకు 160 బదులుగా 41 ఏ సీఆర్పీసీ కిందే నోటీసులు ఇస్తారని, విచారణ అనంతరం ఆమె పేరును నిందితుల జాబితాలో చేర్చాలా వద్ద అన్న నిర్ఱణయం సీబీఐ తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరో వైపు ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ రేపు ప్రశ్నించాల్సి ఉంది. కానీ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేనందునా రేపటి విచారణకు తాను హాజరుకాలేనంటూ కవిత సమాచారం ఇచ్చారు. అలాగే రేపు తనకు ముందుస్తు కార్యక్రమాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ నెల 11,1214,15 తేదీల్లో ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో దర్యాప్తునకు సహకరిస్తానని లేఖలో పేర్కొన్నారు.
Read More.......
రెడ్డి కోడలిని చేసుకుంటే పార్టీలు, పిక్నిక్‌లు అంటూ తిరిగేది: మంత్రి మల్లారెడ్డి