రాజకీయ భవిష్యత్తుపై అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు

తన రాజకీయ భవిష్యత్తుపై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నా రాజకీయ భవిష్యత్తు ఏఐసీసీ అధిష్టానం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు.

Update: 2024-02-26 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: తన రాజకీయ భవిష్యత్తుపై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నా రాజకీయ భవిష్యత్తు ఏఐసీసీ అధిష్టానం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించారు. నేను నిఖార్సయిన కార్యకర్తను, పార్టీ కోసం పనిచేస్తా, పార్టీ ఎలా ఉపయోగించుకోవాలనున్నా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కాంగ్రెస్ నన్ను ఒక అస్త్రంగా వాడుకుంటుందేమో అని అన్నారు. మంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డే సరైనోడని అన్నారు. బీఆర్ఎస్‌ హయాంలో తెలంగాణ దోపిడీకి గురైందని అన్నారు.

అవినీతి పరులను ఎవరిని వదిలిపెట్టబోము అని హెచ్చరించారు. కాళేశ్వరం అనుమతులు ఇచ్చినవారిని కూడా వదలం అని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేసిందేం లేదని తెలిపారు. కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు.. బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. విచారణకు నోటీసులు ఇచ్చిన సీబీఐ.. బిజీగా ఉన్నానని చెప్తే కవితకు మినహాయింపు ఇచ్చినట్లు, హేమంత్ సొరేన్, సోనియా గాంధీ లాంటి మిగితా నాయకులకు ఎందుకు ఇవ్వరు? అని కీలక ప్రశ్నలు సంధించారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ చేసిన అవినీతిని కాపాడింది, కాపాడుతున్నది బీజేపీనే అన్నారు.

Tags:    

Similar News