అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలి : సిర్పూర్ ఎమ్మెల్యే

అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని కొమురం భీం

Update: 2024-10-16 15:09 GMT

దిశ, భీమిని : అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేసుల పూర్ గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికం నుంచి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గమని యువతకు హితవు పలికారు. వ్యసనాలకు బానిస కాకుండా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా యువత సన్మార్గంలో నడవాలని సూచించారు.

అనంతరం కేసులాపూర్, చిన్న గుడి పేట గ్రామాల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఏళ్లుగా చిన్న గుడి పేట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఆసిఫాబాద్ డిపో మేనేజర్ కు గ్రామానికి బస్సు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని డిపో మేనేజర్ కు తెలిపారు. మారుమూల గ్రామాల్లో కూరుకుపోయిన సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ.పీ పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ గంగక్క బ్రహ్మయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Similar News