విద్యా వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట : మంత్రి సీతక్క

రాష్ట్రంలో విద్యా వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని

Update: 2024-10-16 15:21 GMT

దిశ, ఆసిఫాబాద్ : రాష్ట్రంలో విద్యా వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ , సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్, ఎమ్మెల్యే కోవలక్ష్మిలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గుండి గ్రామంలో పదో తరగతి వరకు ఉన్నతి కరించిన పాఠశాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఇందులో భాగంగానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. గుండి గ్రామంలో అంతర్గత రోడ్లతో పాటు సర్పంచ్ లు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న గుండి వాగు వంతెన నిర్మాణం పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అడ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు.

ప్రాజెక్టు వద్ద టూరిజం రెస్టారెంట్ ప్రారంభించి మంత్రి బోర్డ్ లో ప్రయాణించారు. జిల్లాలో టూరిజం పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా జిల్లా సమాఖ్య ద్వారా 270 మహిళా సంఘాలకు రూ.16 కోట్ల చెక్ అందజేశారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని. ఇందులో భాగంగానే ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదురుగాలని సూచించారు. అనంతరం ప్రధాన మంత్రి జన్ మాన్ పథకం కింద పీవీటీజీ గ్రామాలకు వైద్య సేవలు అందించేందుకు మొబైల్ వాహనాలను ప్రారంభించారు. పీవీటీజీల అభివృద్ధి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తాము ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.


Similar News