బెల్లంపల్లి అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా..: ఎంపీ వంశీకృష్ణ

బెల్లంపల్లి అభివృద్ధికి శాయశక్తుల చేయూతనిస్తానని పెద్దపల్లి

Update: 2024-09-25 10:56 GMT

దిశ,బెల్లంపల్లి: బెల్లంపల్లి అభివృద్ధికి శాయశక్తుల చేయూతనిస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో రూ.7.58 కోట్ల నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ భవనాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. బెల్లంపల్లి అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి అవసరమైన ఆర్థిక చేయూతను ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతుగా సహాయం నిరంతరం ఉంటుందన్నారు. బెల్లంపల్లి అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తానని పునరుద్ఘాటించారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ హయాంలోని అభివృద్ధి అంకం మొదలైంది అన్నారు. ప్రభుత్వం ప్రజా పాలన లో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ హామీలు నెరవేరుతున్నాయన్నారు. ఎన్నికల ముందు బెల్లంపల్లి ప్రజలు వ్యాపారులు మార్కెట్ సముదాయం లేదని చెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ నిర్మించి మాట నిలబెట్టుకున్నామన్నారు.

ప్రజల చిరకాల నిజం చేశాo..

బెల్లంపల్లి ప్రజల చిరకాలంగా ఎదురుచూస్తున్న మార్కెట్ సదుపాయం తీరిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిని చేపట్టలేదు అన్నారు. బెల్లంపల్లిలో సౌకర్యవంతమైన మార్కెట్ భవనాన్నినిర్మించుకున్నామన్నా రు. వ్యాపారులు, ప్రజలకు మార్కెట్ సముదాయం సౌలభ్యం లేక ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. మార్కెట్ సముదాయాన్ని వ్యాపారులు సక్రమంగా వినియోగించు కోవాలన్నారు. వ్యాపారులకు మార్కెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. బెల్లంపల్లి లో రక్షిత మంచినీటి సౌకర్యం లేక ఇంతకాలం ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. అమృత 2.0 కింద 61.5 కోట్ల నిధులతో ఎల్లంపల్లి తాగునీటి పథకాన్నిచేపట్టామన్నారు.త్వరలో బెల్లంపల్లి ప్రజలకు ఎల్లంపల్లి తాగునీటిని అందిస్తామన్నారు. అంతేకాకుండా బెల్లంపల్లి అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో భారీ ఎత్తున నిధుల మంజూరు చేపించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. బెల్లంపల్లి అభివృద్ధి ధ్యేయంగానే పనిచేస్తున్నాన్నారు.

రూ.98 కోట్ల తో పీటీఆర్ ప్రారంభం..

బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ లో గల 33/11 కేవి విద్యుత్ సబ్ స్టేషన్ లో రూ.98 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన 5. మెగావాట్ల సామర్థ్యం గల పి టి ఆర్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇప్పటినుంచి విద్యుత్ నాణ్యత పెరిగి మరింత సౌకర్యం కలుగుతుందన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రావన్నారు. అంతేకాకుండా మరిన్ని కొత్త ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా పెరుగుతుందన్నారు. ప్రజలకు విద్యుత్తు బాధలు తీరి పోనున్న యన్నారు. బెల్లంపల్లి కార్మికుల ఇండ్లకు ఇకనుంచి విద్యుత్తు నిలిపివేరని పేర్కొన్నారు.

ఈ మేరకు సింగరేణి అధికారులతో మాట్లాడామని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ విద్యుత్ సదుపాయం డిసెంబర్ చివరి వరకు కార్మికులు ప్రజలు విద్యుత్ సదుపాయం కొత్తగా విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ అధికారులు ఈలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాసరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మత్తంమరి సూరిబాబు, చిలుముల శంకర్, ముచర్లమల్లయ్య, మంచిర్యాల ఎస్ ఈ శ్రవణ్ కుమార్, బెల్లంపల్లి డి ఈ డి రాజన్న, ఏ డి ఈ శ్రీనివాస్, రామచందర్, పెద్దిరాజo, బెల్లంపల్లి ఏఈ బి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Similar News