గైర్హాజరైన అధికారులపై చర్యలు ఏవి?

గత సమావేశానికి గైర్హాజరు అయిన అధికారులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సభ్యులు పట్టు పట్టడంతో మండల సర్వసభ్య సమావేశం నిలిచిపోయింది.

Update: 2023-03-29 08:40 GMT

దిశ, లోకేశ్వరం: గత సమావేశానికి గైర్హాజరు అయిన అధికారులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సభ్యులు పట్టు పట్టడంతో మండల సర్వసభ్య సమావేశం నిలిచిపోయింది. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశంపై అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశానికి విద్యుత్, అటవీ, విద్యాశాఖ అధికారులు హాజరు కాకపోవడంతో వారు సమావేశానికి హాజరయ్యేంతవరకు సమావేశాన్ని కొనసాగించేది లేదని సభ్యులు పట్టుబట్టగా వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని ఎంపీడీవో తెలపడంతో సభ్యులు గత సమావేశాన్ని కొనసాగించారు. కాగా ఈరోజు నిర్వహించిన సమావేశానికి మళ్లీ విద్యాశాఖ, అటవీశాఖ అధికారులు హాజరు కాకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యేంతవరకు కొనసాగ నిచ్చేది లేదంటూ బైటాయించారు. దీనితో సమావేశం నిలిచిపోయింది.

Tags:    

Similar News