సింగరేణి అభివృద్ధిలో ముందుంటాం : బెల్లంపల్లి ఎమ్మెల్యే

సింగరేణి సంస్థను అభివృద్ధి బాటలో నిలిపేందుకు తమ కుటుంబం

Update: 2024-10-11 11:35 GMT

దిశ, తాండూర్ : సింగరేణి సంస్థను అభివృద్ధి బాటలో నిలిపేందుకు తమ కుటుంబం నిరంతరం ముందుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం గోలేటి ఆఫీసర్స్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల పాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ, డైరెక్టర్ బలరాం ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన ఉజ్వల సింగరేణి – ఉద్యోగుల పాత్ర కార్యక్రమం ఉద్యోగుల్లో చైతన్యాన్ని కలిగిస్తుందన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని కాపాడిన ఘనత తమ తండ్రిగారైన కాకా వెంకటస్వామి దేనని కొనియాడారు. తమ కుటుంబం సింగరేణి సంస్థ, ఉద్యోగుల పురోగతి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు.

ఉద్యోగులకు పెర్క్స్ అలవెన్స్ పై ఆదాయపన్ను లేకుండా కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి ఏరియాలో త్వరలో ప్రారంభం కానున్న నూతన గనుల విషయంలో తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి సంస్థ నాది అనుకుని పని చేయాలని కోరారు. ఏరియా శ్రీనివాస్ మాట్లాడుతూ మల్టీ డిపార్ట్మెంట్ అధికారులు, కార్మికుల సమన్వయంతో పనిచేసే సింగరేణి అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అంతకు ముందు మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అధికారులతో కలిసి జిఎం శ్రీనివాస్ సింగరేణి సమగ్ర ప్రగతి పై ప్రొజెక్టర్ ద్వారా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే, జిఎం విందు భోజనం చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి, ఎస్ ఓ టు జిఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్ కుమార్ బెహరా, ఫైనాన్స్ మేనేజర్ మామిడి రవికుమార్, పర్సనల్ మేనేజర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Similar News