యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత శిక్షణతో పాటు యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
దిశ, ఆదిలాబాద్ : ఉచిత శిక్షణతో పాటు యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. యువజన సర్వీసుల శాఖ, సెట్విన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ వృత్తి నైపుణ్యం కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు 3 నెలల పాటు ఇచ్చిన ఉచిత శిక్షణను పూర్తి చేసుకున్న యువతకు శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైటీసీ శిక్షణా కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్, సీసీ కెమెరాల, మొబైల్ రిపేరింగ్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ రిపేరులలో 3 నెలల పాటు అనుభవజ్ఞులైన అభ్యర్థుల ద్వారా శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు.
ఈ కేంద్రంలో ఇప్పటి వరకు ఐటీడీఏ, ఉమెన్ వెల్ఫేర్, స్పాన్సర్డ్ చేసిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన వాటికి సర్టిఫికెట్ అందజేశారు. శిక్షణ పొందిన రంగంలో నైపుణ్యత పొంది ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. ఈ మూడు నెలల్లో 120 మంది యువత శిక్షణ పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, డీడబ్ల్యూఓ సబిత, ఫ్యాకల్టీ, సిబ్బంది, ప్రిన్సిపాల్ రవీందర్, వై టీసీ ఇన్చార్జి బల్ రాం, లలిత, సాగర్, విశాల్, సునీల్ పాల్గొన్నారు.