బోర్ వెల్ బండి అటవీ శాఖ కార్యాలయానికి తరలించాం : ఎఫ్ఆర్ఓ ప్రణయ్
మండలంలోని కంటేగామ, నిగిని గ్రామ శివారులో బోరు వేయడానికి
దిశ, బోథ్ : మండలంలోని కంటేగామ, నిగిని గ్రామ శివారులో బోరు వేయడానికి వెళ్తున్న క్రమంలో చెట్లను నరికి వేస్తున్నారు. ఈ సమాచారంతో ఆదివారం సాయంత్రం అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని బోర్ వెల్ బండిని అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్ ఆర్ ఓ ప్రణయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ ఓ ప్రణయ్ మాట్లాడుతూ బోరుబావుల తవ్వకం కోసం వచ్చిన బోర్ వెల్ వాహనాన్ని తరలించకుండా కొంతమంది అటవీ శాఖ అధికారులతో తీవ్ర వాగ్వివాదానికి దిగినట్లు తెలిపారు.
చివరకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు బోర్ వెల్ వాహనాన్ని తాము బోథ్ అటవీ శాఖ కార్యాలయానికి తీసుకు వెళ్తామని ఏదైనా సమస్య ఉంటే అక్కడ పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. దీంతో బోర్ వెల్ వాహనాన్ని బోథ్ అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ విషయాన్ని ఎఫ్ఆర్ఓ ప్రణయ్ ను వివరణ కోరగా బోరు వేయడానికి వెళ్తున్న క్రమంలో అడ్డుగా వచ్చిన చెట్లను నరికి వేశారు. అందుకే బోర్ వెల్ వాహనాన్ని అటవీ శాఖ కార్యాలయానికి తరలించడం జరిగింది అని అన్నారు. నేరం రుజువైతే వీరిపై కేసు మరియు జరిమానా విధిస్తామని, ఎవరైనా కానీ చెట్లను నరికి వేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.