బోథ్ రెవెన్యూ డివిజన్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఎమ్మెల్యే

Update: 2024-12-17 07:58 GMT

దిశ, బోథ్ : బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అసెంబ్లీలో మాట్లాడుతూ అదిలాబాద్ వెళ్లాలంటే 100 కిలోమీటర్లు పోయి రావాలని, విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉందని దాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి,  సీతక్క ఇచ్చిన హామీని నెరవేర్చాలని కచ్చితంగా బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని అన్నారు. మారుమూల ప్రాంతమైన గిరిజన ప్రాంతమని రోడ్డు సౌకర్యాలు, బస్సు సౌకర్యాలు తక్కువగా ఉంటాయని తెలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రెవెన్యూ మంత్రిని రెవెన్యూ డివిజన్ చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు.


Similar News