ఏప్రిల్ 14 వరకు ఓటరు నమోదుకు అవకాశం

నూతన ఓటర్లుగా నమోదుకు వచ్చేనెల ఏప్రిల్ 14వ తేదీ వరకు అవకాశం ఉన్నందున జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

Update: 2024-03-22 14:44 GMT

దిశ, ఆదిలాబాద్: నూతన ఓటర్లుగా నమోదుకు వచ్చేనెల ఏప్రిల్ 14వ తేదీ వరకు అవకాశం ఉన్నందున జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం ఓటర్ నమోదు పై కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో ప్రత్యేకంగా మాట్లాడారు. మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా, నిజాయితీగా, నిర్భయంగా ఓటు వేయాలని, పోలింగ్ శాతన్ని పెంచాలని కోరారు. ఓటరు జాబితాలో ఓటు ఉందా లేదా అని పరిశీలించుకొని.. లేని పక్షంలో ఓటరుగా నమోదు చేసుకోవాలని, యాప్ ద్వారా గాని, ఫారం -6 ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, ఇప్పటి వరకు ఓటరుగా నమోదు చేసుకోనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Similar News