అనాధ పిల్లపెళ్లి చేసి మానవత్వం చాటుకున్న గ్రామస్తులు

నేరడిగొండ మండల కేంద్రంలోని వడూర్ గ్రామానికి చెందిన బొగ్గు సంగీత చిన్నప్పుడే తల్లి తండ్రిని కోల్పోయింది అనాధగా పెరిగిన సంగీతకు వడూర్ గ్రామస్తులు మతాలకు అతీతంగా డబ్బులు సామగ్రి పొగుచేసి సోమవారం బోథ్ మండల కేంద్రంలోని కనుగుట్ట గ్రామనికి చెందిన ఆకాష్ కు ఇచ్చి స్థానిక సాయిబాబా మందిరంలో పెళ్లి చేసిమానవత్వాన్ని చాటుకున్నారు.

Update: 2022-10-17 15:33 GMT

దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలోని వడూర్ గ్రామానికి చెందిన బొగ్గు సంగీత చిన్నప్పుడే తల్లి తండ్రిని కోల్పోయింది అనాధగా పెరిగిన సంగీతకు వడూర్ గ్రామస్తులు మతాలకు అతీతంగా డబ్బులు సామగ్రి పొగుచేసి సోమవారం బోథ్ మండల కేంద్రంలోని కనుగుట్ట గ్రామనికి చెందిన ఆకాష్ కు ఇచ్చి స్థానిక సాయిబాబా మందిరంలో పెళ్లి చేసిమానవత్వాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ చిన్నప్పుడే తల్లిదండ్రిని కోల్పోయినుంచి తమ కళ్ళ ముందు పెరిగిన నిరు పేద సంగీత కు ఒక ఇంటిదాన్ని చేయడం తమకు చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. పిల్ల పెళ్లికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పండరీ వీడీసీ చైర్మన్ చంద్రశేఖర్ గ్రామ పెద్దలు, గాదె శంకర్ మకసూరి రాములు, ఏ రాములు కళాలి వెంకట రమణ రాం పెద్దబావు అయిటి రమేష్ చొక్కాపల్లి రాములు. ప్రమోద్ ప్రదీప్ గాదె రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News