కాలినడకన అయోధ్యకు చేరిన జాదవ్.. ఘన స్వాగతం వీహెచ్‌పీ
మూడో సారి మోడీ సర్కార్ అనే నినాదంతో తన లక్ష్యంగా పెట్టుకొని కాలినడకన అయోధ్యకు చేరుకున్న యువకుడిని శభాష్ మాధవరావు అని స్థానికులు మెచ్చుకుంటున్నారు.
దిశ, కుబీర్: మూడో సారి మోడీ సర్కార్ అనే నినాదంతో తన లక్ష్యంగా పెట్టుకొని కాలినడకన అయోధ్యకు చేరుకున్న యువకుడిని శభాష్ మాధవరావు అని స్థానికులు మెచ్చుకుంటున్నారు. కుబీర్ మండల కేంద్రానికి చెందిన జాదవ్ మాధవరావు అనే యువకుడు గత నెల 27 కుబీర్ విఠలేశ్వర మందిరంలో పూజా కార్యక్రమాలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఒకరోజు ముందు అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ విశ్వ హింద్ పరిషత్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
సుమారు 1200 కి.మీ 26 రోజుల పాటు ప్రయాణం పాదయాత్రగా చేశారు. ఉదయం పూట నడవడం రాత్రి సమయంలో ఆలయాల్లో పడుకుని తన యాత్రను కొనసాగేంచాడు. పలుచోట్ల హిందూ పరిషత్, భజరంగ్ దళ్, భీజేపీ, హిందూ సంఘాలు ఘన స్వాగతం పలికి ఆత్మీయతను చాటాయి. స్వాగత సమయంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు అభినందించారు. సంకల్పయాత్రను కొనియాడారు. అయోధ్యకు పాదయాత్రగా బయలుదేరి విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో స్థానికులు సంబరపడుతున్నారు.