ఉజ్వల సింగరేణి- ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం : చెన్నూరు ఎమ్మెల్యే

సింగరేణి కార్మికుల పనితీరు, ఉత్పత్తి వ్యయం, కంపెనీ భవిష్యత్తుపై ప్రతి

Update: 2024-10-11 11:43 GMT

దిశ, మందమర్రి : సింగరేణి కార్మికుల పనితీరు, ఉత్పత్తి వ్యయం, కంపెనీ భవిష్యత్తుపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం కేకే 5 గని పై ఉజ్వల సింగరేణి-ఉద్యోగుల పాత్ర గురించి యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆయన స్థానిక జీఎం దేవేందర్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి పరిశ్రమలు సంయుక్తంగా సింగరేణి సంస్థ భవిష్యత్తులో నిర్వహించబోయే సంస్కరణల గురించి కార్మికులకు తెలియజేస్తుందని అన్నారు.

అనంతరం కార్మికులందరికీ సింగరేణి వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులు, డిపార్ట్ మెంట్లలలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికులు, పర్మినెంట్ ఉద్యోగులందరితో సహపంక్తి భోజనాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం కంపెనీ లక్ష్యాలను సాధించిన కార్మికులందరినీ పేరుపేరునా వారు అభినందించారు. అనంతరం నూతన గనులు, థర్మల్, సోలార్ విద్యుత్, పవర్ ప్లాంట్, ఇతర వ్యాపార విస్తరణ అంశాలపై ఉద్యోగులకు, పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఏఐటీయూసీ రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ,సీఎంఓఏఐ మందమర్రి ఏరియా అధ్యక్షుడు రమేష్, డీజీఎం ఐఈడీ రాజన్న, కేకే గ్రూప్ ఏజెంట్ రాందాస్, కె.కె 5 గని మేనేజర్ ప్రవీణ్, కేకే -5 గని ఉద్యోగులు పాల్గొన్నారు.


Similar News