అగ్నిప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధం
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ గ్రామంలో
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గ్రామానికి చెందిన లింగన్న, శ్రీనివాసులకు చెందిన రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలంలో ఉన్న గ్రామస్తులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టపోయిన ఆస్తి విలువ తెలియాల్సి ఉంది.