ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ప్రతిపక్షాలకు లేదు..
ప్రభుత్వాన్ని విమర్శించే కనీస నైతికత అర్హత ప్రతిపక్షాలు కోల్పోయాయని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి నారదాసు లక్ష్మణ్ రావు అన్నారు.
దిశ, బెల్లంపల్లి : ప్రభుత్వాన్ని విమర్శించే కనీస నైతికత అర్హత ప్రతిపక్షాలు కోల్పోయాయని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి నారదాసు లక్ష్మణ్ రావు అన్నారు. బెల్లంపల్లి పద్మశాలి భవనంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రజలకు ఏమి చేయని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నాడు అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలు పొందుతున్నారన్నారు.
పూర్తి స్థాయిలో ప్రజాపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై నిందలు వేయకుండా ప్రతిపక్షాలు బ్రతకలేవని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజాసంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రజలతోటే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళమనే సత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాలను గొప్పగా నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని అన్నారు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా గ్రామ గ్రామాన వాడవాడలా గులాబి జండా గదిలో నిర్మించి వేడుకలు చేయాలన్నారు. గులాబీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలే బీఆర్ఎస్ కు పునాదులని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారి పాత్ర ఎంతో కీలకమన్నారు. మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పెండింగ్ బిల్లులను ఈనెల చివరి వారంలో మంజూరు చేస్తామని ప్రకటించారని తెలిపారు. ప్రజాప్రతినిధులకు ఇది గొప్ప తీపికబురు అన్నారు. గులాబీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి బీఆర్ఎస్ ను మరింత తిరుగులేని శక్తిగా తయారు చేయాలని కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి బలమైన సైన్యంగా పాతికపోయిందన్నారు.
మరోసారి గులాబీ జెండా విజయకేతనం 56,000 వేల ఓట్లమెజార్టీతో ఎగరవేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపాలు 1200 కోట్లను ఇవ్వాల్సి ఉందని దుయ్యబట్టారు. ఇప్పటి నుండే గులాబీ సైన్యం కష్టపడి పనిచేసి మళ్లీ మనప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. గులాబీ విజయాన్ని ఎవరు ఆపలేరని కార్యకర్తలకు భరోసా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను ప్రణాళిక బద్ధంగా గ్రామ గ్రామాన వాడవాడనా పండగను తలపించేలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేణిగుంట ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.