ప్రాణ త్యాగం చేసిన ఇంద్రవెళ్లి అమరులకు సలాం.. వైఎస్ షర్మిల

జల్, జమీన్, జంగల్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి, అమరులైన ఇంద్రవెళ్లి గడ్డకు సలామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2023-04-20 17:12 GMT

దిశ, ఇచ్చోడ : జల్, జమీన్, జంగల్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి, అమరులైన ఇంద్రవెళ్లి గడ్డకు సలామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇంద్రవెళ్లి సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దివంగత సీఎం వైస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉన్న పాలనలో 3.30లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ఎకరానికి పట్టా ఇవ్వలేదని ధ్వజమెత్తింది. ఆదివాసుల పట్ల సీఎం కేసీఆర్ కు చిత్త శుద్ధి లేదని, ఒక చేతకాని ముఖ్య మంత్రని మండిపడ్డారు.

వైఎస్సార్ బిడ్డగా మాట ఇస్తున్న..

వైఎస్సార్ పోడు భూముల మీద హక్కులు కల్పించినట్లుగా, వైఎస్సార్ బిడ్డగా మీకు మాట ఇస్తున్నా... అధికారంలో వచ్చిన 4 నెలల్లో 13 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ పోడు పట్టాలు ఇస్తా అని ఆదివాసీలను మోసం చేశారని, పట్టాలు అడిగినందుకు జైల్లో పెట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని తీవ్రంగా మండిపడ్డారు. గత 9 ఏళ్లుగా వేలాదిగా కేసులు పెట్టి, గిరిజన బంధు పథకం అమలు చేయక సీఎం కేసీఆర్ గిరిజనులను వంచనకు గురి చేశాడని పేర్కొంది. ఫారెస్ట్ భూముల్లో ట్రెంచ్ లు వేస్తున్నారని చెప్పారు. 10శాతం రిజర్వేషన్ అమలు అని చెప్పి పట్టించుకోలేదని, రాష్ట్ర బడ్జెట్ లో కనీసం ఒక శాతం కూడా నిధులు ఖర్చు చేయడం లేక గిరిజన ద్రోహిగా మిగిలి పోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలో వచ్చాక ఆదివాసీల డిమాండ్లను పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. ఈ కార్య క్రమంలో గాయకుడు ఏపూరీ సోమన్న, ఆదివాసుల హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు పోశన్న, జిల్లా అధ్యక్షులు గోడం గణేశ్, ఆదివాసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News