కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నాయకుల రాజీనామాతో గ్రూపు విభేదాలు గుప్పుమన్నాయి.

Update: 2023-02-08 14:42 GMT

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నాయకుల రాజీనామాతో గ్రూపు విభేదాలు గుప్పుమన్నాయి. గ్రూపు తగదాలతో విసిగిపోయి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్సల్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం, కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బైరి శ్రీనివాస్ పార్టీ సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు పత్రికాప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాల కారణంగానే మనస్థాపానికి గురై తాము కాంగ్రెస్ పార్టీకి, కొనసాగుతున్న పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News