Flood : ప్రాణహిత పరవళ్లు.. నీట మునిగిన వేలాది ఎకరాల పంట పొలాలు
ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది
దిశ,బెజ్జూర్: ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. బెజ్జూరు మండలంలో ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. మహారాష్ట్రలో ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. ప్రాణహిత నది పరిసర ప్రాంతాల్లో వేసిన పత్తి పంటలు మునిగాయి. బెజ్జూర్ మండలంలోని మొగవెళ్ళ్లి, సోమిని, తలాయి,తికపల్లి, భీమవరం ,పాపన్నపేట, పాత సోమిణి, తదితర గ్రామాల్లో రైతులు వేసిన ప్రతి పంటలు ప్రాణహిత వరదల వల్ల నీట మునిగి రైతులు వేసిన పంటలు నష్టపోయారు. ప్రాణహిత వరదల వల్ల బెజ్జూరు మండలంలోని తలాయి, తిక్క పల్లి భీమవరం గ్రామాలు జలదిగ్బంధంలో మూడు రోజులుగా ఉన్నాయి.
ఈ గ్రామాలకు ప్రజలు వెళ్లాలంటే నాటుపడవలో ప్రయాణించక తప్పడం లేదు. సోమవారం తలాయి గ్రామంలో నుంచి పాపన్ పేట వరకు 8కిలోమీటర్ల బెజ్జూరు కు వచ్చేందుకు నాటు పడవల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ప్రమాదకరంగా నాటు పడవల్లో ప్రయాణించి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. జలదిబ్బంధంలోని గ్రామాల్లో కరెంట్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాక్ వాటర్ తో బెజ్జూర్ మండల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.