పండగపూట నల్లపోషమ్మ ఆలయంలో చోరీ

పండగపూట నల్లపోషమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని

Update: 2024-10-12 06:54 GMT

దిశ,ఖానాపూర్ : నల్లపోషమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అమ్మవారి నగలు,చీరలు దొంగిలించిన సంఘటన ఖానాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో రెంకొని వాగు సమీపంలో ఉన్న నల్ల పోషమ్మ గుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పురోహితుడు ఆదివారం ఉదయం అమ్మవారికి పూజలు నిర్వహించడానికి వెళ్లిన ఆయనకు నల్ల పోషమ్మ ఆలయం తాళం పగులగొట్టి ఉండడం చూసి అవాక్కయ్యాడు.అమ్మవారి మీద ఉన్న నగలు పుస్తెలతడు,హరం ఒరిజినల్ బంగారం అనుకోని ఆర్నమెంట్ నగలను, 2 తులాల వెండి విగ్రహాలు,ఇత్తడి నవగ్రహాలు,అమ్మవారి చీరలను దోచుకెళ్లారు. సుమారు రూ.30 వేల విలువ ఉంటుందని పురోహితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


Similar News