సోయాపంటను అమ్మి బీఆర్ఎస్ కు విరాళం

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన పట్ల ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి.

Update: 2022-10-05 11:01 GMT

దిశ, నేరడిగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన పట్ల ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా కే గ్రామానికి చెందిన 33 మంది రైతులు తమ సోయా పంటను ఒక్కొక్కరు 50 కిలోలు చొప్పున విక్రయించి ఇందుకు సంబంధించిన డబ్బులు రూ. 66,000 జాతీయ పార్టీకి విరాళంగా ప్రకటించారు.

బ్యాండ్ బాజాలు వాయిస్తూ పంట పొలాల్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గతంలో తాము కూలీ పని చేసుకుంటూ జీవించేవారమని కేసీఆర్ ఉచితంగా ఇచ్చిన మూడు ఎకరాల భూమితో రైతులుగా మారి రెండు పంటలు సాగు చేస్తున్నట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా తమలాంటి పేదలు బాగుపడతారని, వారికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News