ఆ దారం అమ్మితే జైలుకే..

గాలిపటాలు ఎగరవేయడానికి ప్రభుత్వం నిషేధించిన ఆ దారాన్ని అమ్మితే జైలుకు పంపిస్తామని లోకేశ్వరం ఎస్సై అశోక్ దుకాణదారులను హెచ్చరించారు.

Update: 2025-01-07 09:23 GMT

దిశ, లోకేశ్వరం : గాలిపటాలు ఎగరవేయడానికి ప్రభుత్వం నిషేధించిన ఆ దారాన్ని అమ్మితే జైలుకు పంపిస్తామని లోకేశ్వరం ఎస్సై అశోక్ దుకాణదారులను హెచ్చరించారు. మంగళవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని పలు దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగర వేసేందుకు చాలా మంది చైనా మాంజా వినియోగించేందుకు ఉత్సాహం చూపుతారని, అది వాడడం వల్ల మనుషులతో పాటు పక్షులకు, పశువులకు ప్రమాదం ఉందని దాని వాడకం వల్ల కలిగే అనర్థాలను దుకాణదారులకు వివరించారు. దానిని విక్రయించినా, వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని అలాంటి వారి సమాచారాన్ని 8712659541 నంబర్ కు సమాచారం ఇవ్వాలని అన్నారు.


Similar News