బెల్లంపల్లి బల్దియాలో డంప్ యాడ్‌కు స్థలం..

ఎట్టకేలకు బెల్లంపల్లి మున్సిపాలిటీకి డంప్ యాడ్ కు స్థలం

Update: 2024-09-23 16:32 GMT

దిశ,బెల్లంపల్లి: ఎట్టకేలకు బెల్లంపల్లి మున్సిపాలిటీకి డంప్ యాడ్ కు స్థలం దొరికింది. ఇంతకాలం డంప్ యాడ్ కు స్థలం లేక ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే శివారు ప్రాంతంలో చెత్తను డంప్ చేశారు. బెల్లంపల్లి పట్టణ శివారులోని 65 డీప్ ఉమేష్ చంద్ర రోడ్డు లో డంప్ యాడ్ కు స్థలం కేటాయించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారుల నుండి స్థలం కేటాయింపు జరిగింది. దీంతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కష్టాలు తీరిపోయాయి. పట్టణ శివారులో విశాలమైన ప్రభుత్వ స్థలం డoప్ యాడ్ కు అనువైంది. ఈ స్థలం కోసం మున్సిపల్ అధికారులు రెవెన్యూ కి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఆ స్థలంలో డంప్ యాడ్ పై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ఏర్పాటు కు సులభతరమైంది. దీంతో డంప్ యాడ్ కు రెవెన్యూ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Similar News