దొరల పాలన పోవాలి.. ప్రజాపాలన రావాలి : రేవంత్ రెడ్డి

తెలంగాణని దొరలు దోచుకుంటున్నారని తెలంగాణలో దొరల పాలన పోవాలి.. ప్రజల పాలన రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-11-15 11:02 GMT

దిశ, బోథ్ : తెలంగాణని దొరలు దోచుకుంటున్నారని తెలంగాణలో దొరల పాలన పోవాలి.. ప్రజల పాలన రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బధవారం బోథ్ నియోజ వర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ ని బలపరుస్తూ నిర్వహించిన ప్రజావిజయ భేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారిసభలో మాట్లాడుతూ తెలంగాణలో దొరల పాలన ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజాపాలన రావాలని తెలిపారు. సోనియమ్మ తుక్కుగూడలో ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు చూసి కేసీఆర్ అగం ఆగం అవతున్నడని, అందుకే ఫాం హౌజ్ లో పడుకున్న కేసీఆర్ ఓటమి పక్కా అని భయపడి రోజుకు ఒక ఊరిని పట్టుకొని తిరుగుతున్నారని తెలిపారు. లక్షల కోట్లు ప్రజాధనం వృధా చేశాడని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానికి దక్కిందని తెలిపారు. ప్రజలు ఇక చరమగీతం పాడుతారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభివృద్ధి ఏమి అయిందని ప్రశ్నించారు.

సర్పంచ్ లు అప్పులు చేసి గ్రామ అభివృద్ధి పనులు చేస్తే నిధులు ఇవ్వకుండా దద్దమ్మ మంత్రి దద్దమ్మ దయాకర్ బీర్ సీసాలు అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చాయి అనడం సిగ్గు చేటన్నారు. తాగుబోతు కేసీఆర్ పోవాలి తెలంగాణ అభివృద్ధి కావాలి అంటే తెలంగాణలో కాంగ్రెస్ రావాలి అని తెలిపారు. కావున ఆరు గ్యారంటీలు చూసి ఓటు వెయ్యాలని తెలిపారు. ఎన్నికలు అయ్యాక అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 31 లోపు బోథ్ నియోజవర్గ ముఖ్యమైన సమస్య అయిన బోథ్ రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని, కుప్టి ప్రాజెక్ట్ నిర్మిస్తామని, జనరల్ డిగ్రీ కాలేజీ, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇవ్వనీ జరగాలి అంటే అడే గజెందర్ ను భారి మెజార్టీతో గెలిపించాలని కోరారు. సభకి వచ్చిన వారితో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి భై భై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డితో మాజీ కేంద్ర మంత్రి సభ్యులు బలరాం నాయక్ పాల్గొన్నారు.

Tags:    

Similar News