అధికారులు సమన్వయంతో పని చేయాలి

ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.

Update: 2024-03-22 12:35 GMT

దిశ, ఆసిఫాబాద్: ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ సురేష్ కుమార్, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఎస్పీ సదయ్యతో కలిసి పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై నోడల్, సెక్టోరల్‌తో పాటు ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులకు తమ పనులు పట్ల పూర్తి అవగాహన ఉండాలని, సెక్టోరల్, పోలీసు అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని. దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భిణులకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 51 సెక్టార్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో ఎన్నికల నిర్వహణ కొరకు 001-సిర్పూర్‌లో 320 పోలింగ్‌ కేంద్రాలు, 005-ఆసిఫాబాద్‌లో 356 పోలింగ్ కేంద్రాలు ఉండగా సహాయక పోలింగ్ కేంద్రాలతో మొత్తంగా 676 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ప్రతి సెక్టోరల్ అధికారి తన రూట్‌ను పరిశీలించి సమస్యాత్మక షాడో పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటి వివరాలను తెలపాలని సూచించారు. 85 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలింగ్ సమయంలో విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలని. పోలింగ్ రోజున మాక్ పోలింగ్ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో సమస్య తలెత్తి నట్లయితే వెంటనే పరిష్కరించడానికి కృషి చేయాలని. జిల్లాలో ఎన్నికలు పకడ్బందీగా సజావుగా సాగేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో నోడల్‌, సెక్టోరల్ పోలీసు సెక్టోరల్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


Similar News