Nirmal MLA : దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దు

అహర్నిశలు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి

Update: 2024-11-04 12:30 GMT

దిశ, మామడ : అహర్నిశలు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ,ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొరటికల్ గ్రామంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొరటికల్ నుంచి పోతారం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు బాపురెడ్డి ,ఏలేటి చిన్న లింగారెడ్డి, రావుల రామ్ నాథ్ ,చిన్నారెడ్డి,రాజు,అధికారులు రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News