గుహ‌లో మంత్రి సీత‌క్క

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం గొందిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క మంగ‌ళ‌వారం సందర్శించారు.

Update: 2024-01-23 12:15 GMT

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం గొందిలో గల జంగు బాయి పుణ్యక్షేత్రాన్ని మంత్రి సీతక్క మంగ‌ళ‌వారం సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె జంగు బాయి ప్రాంగణంలో ఉన్నటువంటి గుహ లోపలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసులతో కలిసి ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ… జంగు బాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవమని ఎవరు ఏది కోరుకున్న కోరిక నెరవేర్చే దేవత అని అన్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జంగు బాయి పుణ్యక్షేత్ర ప్రకృతిని ఎలాంటి హాని కలిగించకుండా అభివృద్ధి చేస్తామని, పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News