శాస్త్రీయ వైఖరి అలవర్చుకోవాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ,నిర్మల్ కల్చరల్: విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోవాలి, తద్వారా శాస్త్రీయ వైఖరి పెంపొందుతుందని రాష్ట్ర మంత్రి అల్లోల
దిశ,నిర్మల్ కల్చరల్: విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథం అలవర్చుకోవాలి, తద్వారా శాస్త్రీయ వైఖరి పెంపొందుతుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజుల్ పేట్ లోగల బ్లూస్టార్ హైస్కూల్లో విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి హాజరయ్యారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల ప్రయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు వైజ్ఞానిక రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నారు. సైన్స్ పట్ల ఆసక్తిపెంచుకొని రాణించాలని తెలిపారు. అనంతరం వ్యవసాయంపైన చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థినికి మంత్రి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్ సలీం, నాయకులు గండ్రత్ రమేష్, రిజ్వాన్, ప్రధానోపాధ్యాయులు ముజీద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.