తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు.. కాంగ్రెస్ నేతలు

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పై తపుడు ప్రచారం చేస్తే సహించేది లేదని మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

Update: 2023-01-30 11:31 GMT

దిశ, మంచిర్యాల టౌన్: మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పై తపుడు ప్రచారం చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పట్టణ నాయకులు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతు.. ప్రజా సమస్యలను తీర్చడం పోయి ప్రతి పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం తగదని, అభివృధి చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యాడని మండిపడ్డారు. ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న సేవలను సహించలేని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు కూతలు కూస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేసినప్పుడు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి గానీ ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదు అని తెలియజేశారు. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ నిమిత్త మత్రుడేనని, సమస్యలు పరిష్కా రించడం లో విఫలం అయ్యారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో దివాకర్ రావుని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ప్రేమ్ సాగర్ రావుని భారీ మెజారిటీతో గెలిపించడం తథ్యం అని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ ,తూముల వెంకటేష్, పుధరి ప్రభాకర్ ,పుట్ట లావణ్య ,లలిత పాల్గొన్నారు.

Tags:    

Similar News