Khanapur MLA : రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలి

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన

Update: 2024-08-25 13:04 GMT

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని ఆదివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు.వారికి అందిస్తున్న వైద్య సేవలపై రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందించే భోజనాన్ని పరిశీలించారు.ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డైరెక్టర్ కు సూచించారు.భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.వైరల్ జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News