Kadem project : కడెం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లు పైకి ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు.

Update: 2024-07-20 15:52 GMT

దిశ, కడెం : నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు చెందిన మూడు గేట్లు పైకి ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 690.350 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టుల్లోకి వస్తున్న ఇన్ ఫ్లో 8105 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 10983 క్యూసెక్కులు నీరు గోదావరిలోకి విడుదల చేసినట్లు సీఈ శ్రీనివాస్, డీసీఈ మధుసూదన్ రెడ్డి, ఈఈ విట్టల్ రాథోడ్, డీవై ఈఈ భోజ దాస్ తెలిపారు.

Tags:    

Similar News