ఈ నెల 24 చివరి తేదీ.. ఈలోగా ఇంటర్ విద్యార్థులు ఫీజు చెల్లించాలి

Update: 2022-01-18 06:05 GMT

దిశ, ఆసిఫాబాద్: జిల్లాలోని ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోగా వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. వార్షిక పరీక్ష ఫీజు రూ. 490, సైన్స్ మరియు ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు రూ. 200, బ్రిడ్జి కోర్సుకు రూ. 150 చొప్పున ఫీజులు చెల్లించాలని తెలిపారు. అక్టోబర్ లో నిర్వహించబడిన పరీక్షల్లో ప్రథమ సంవత్సరం అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించారని, ఎవరైనా ఇంప్రూవ్ మెంట్ కోరుకుంటే వార్షిక ఫీజుతోపాటు ప్రతీ పేపర్ కు రూ. 150 చొప్పున చెల్లించాలని తెలిపారు. పరీక్ష ఫీజుల చెల్లింపునకు వ్యాక్సినేషన్ తప్పనిసరని, 15 నుండి 18 సం. విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేట్ కళాశాలల్లోని ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు సకాలంలో సమాచారాన్ని అందించి గ్రూపుల వారీగా విద్యార్థులను కళాశాలకు రప్పించాలని, నిర్ధారిత షెడ్యూల్ ప్రకారం కరోనా నిబంధనలు పాటిస్తూ ఫీజులు చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

Tags:    

Similar News