సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దిశ, ఆసిఫాబాద్ : విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె కు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏడాది గడుస్తున్నా పరిష్కరించ డంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.