జర్నలిస్టుల పై దాడికి పాల్పడిన హోమ్ గార్డు సస్పెండ్

ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం రాత్రి జర్నలిస్టుల పై దాడికి పాల్పడిన హోమ్ గార్డు మామిడి విజయ్ కుమార్ ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చెసినట్లు ఉట్నూర్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ నాగేందర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Update: 2023-02-14 17:05 GMT

దిశ, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో సోమవారం రాత్రి జర్నలిస్టుల పై దాడికి పాల్పడిన హోమ్ గార్డు మామిడి విజయ్ కుమార్ ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చెసినట్లు ఉట్నూర్ డివిజన్ డీఎస్పీ సిహెచ్ నాగేందర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దాడికి పాల్పడిన ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, హోంగార్డుల పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బోథ్ డివిజన్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో లిఖిత పూర్వకంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఘటనపై డీఎస్పీ, స్థానిక సీఐ ముదావత్ నైలు సమగ్ర విచారణ జరిపారు. అనంతరం స్థానిక సీఐ కార్యాలయం లో విలేకరులతో డీస్పీ మాట్లాడారు. దాడులకు పాల్పడే వారు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదన్నారు. హోంగార్డు గా విధులు నిర్వహిస్తూ జర్నలిస్టులపై భౌతికంగా దాడులు చేయడం సరికాదన్నారు.

Tags:    

Similar News